తమిళనాడు నూతన ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపట్టిన పురచ్చితలైవి
అన్నాడీఎంకే అధినేత్రి జె.జయలలిత తమిళనాడు ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. గవర్నర్ రోశయ్య జయతో ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం జయకు గవర్నర్ రోశయ్య పుష్పగుచ్ఛం అందించి అభినందనలు తెలియజేశారు. ప్రస్తుతం, 29 మంది మంత్రుల ప్రమాణ స్వీకార కార్యక్రమం కొనసాగుతోంది. మంత్రులందరి చేత సామూహికంగా ప్రమాణస్వీకారం చేయించారు. మద్రాస్ యూనివర్శిటీ ఆడిటోరియంలో జరిగిన ఈ కార్యక్రమానికి భారీ ఎత్తున ప్రముఖులు తరలివచ్చారు. ఈ క్రమంలో, జయ ఐదోసారి తమిళనాడు ముఖ్యమంత్రిగా అవతరించారు.